ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి  ప్రాణం తీసిన మామిడి కాయలు - east godawari

మామిడి కాయలు కోశాడని.... పంచాయతీ కార్యాలయంలో బంధించారు. పెద్దలను పిలుచుకొని వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిందో అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నార.

వ్యక్తి  ప్రాణం తీసిన మామిడి కాయలు

By

Published : May 30, 2019, 7:44 AM IST


పంచాయతీ కార్యాలయంలో ఫ్యానుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో చోటుచేసుకుంది.పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన బక్కి శ్రీను అనే వ్యక్తి భార్యాబిడ్డలతో తన అత్త గారి ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా... దారిలో ఉన్న మామిడితోటలో మామిడి పళ్ళు కోశాడు. ఇది గమనించిన తోట కౌలుదారు శ్రీనును పంచాయతీ కార్యాలయంలో బంధించాడు. విషయం గ్రామ పెద్దలకు చెప్పి వారిని తీసుకొచ్చే సరికి ఫ్యాన్​కు ఉరేసుకొని అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు.
అయితే శ్రీను మామిడి కాయలు కోశాడన్న నెపంతో తీవ్రంగా కొట్టిచంపి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఘటనాస్థలం నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితి అదుపుతప్పకుండా గ్రామంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.

వ్యక్తి ప్రాణం తీసిన మామిడి కాయలు

ABOUT THE AUTHOR

...view details