యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి దూకి అంబేడ్కర్ నగర్‌కు చెందిన మోకా కళ్యాణ్ మూర్తి... ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బ్రిడ్జి వద్ద గస్తీ చేస్తున్న పోలీసు ఫోను నుంచి తండ్రి మోహనరావుతో ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. అర్థరాత్రి దాటినా ఇంటికి రాకపోవడం..సెల్‌ఫోన్ ఎత్తకపోవటంతో కళ్యాణ్ మూర్తి తండ్రి పోలీసు వద్దకు వచ్చాడు. కుమారుడు అక్కడ లేకపోవడంతో వారధి మీద పరిశీలించారు. కుమారుడు ఉపయోగించే వాహనం, చరవాణి, చెప్పులు, కనిపించాయి. దీంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కల్యాణ్ మూర్తికి భార్య.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతను గతంలో ఆటో నడిపేవాడు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పోలీసులు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది... గోదావరిలో గాలింపు చేపట్టారు.