ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమార్కుల ధన దాహానికి.. అమాయకుడు బలి - govidapuram current shock latest news

అడవి జంతువులను వేటాడటం కోసం... అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గోవిందపురంలో జరిగింది.

man died with current shock
కరెంట్ షాకుతో వ్యక్తి మృతి

By

Published : Jan 27, 2021, 12:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురంలో విషాదం నెలకొంది. అడవి జంతువులను వేటాడి.. సొమ్ము చేసుకునేందుకు.. అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కలిదిండి సురేష్ పశువులు కాస్తూ.. వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లి తిరిగి వస్తుండగా... విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫారెస్టు అధికారులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆరోపించారు. జరిగిన ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details