కరోనా నిర్ధరణ కాకపోయినా... ఆ లక్షణాలతో చనిపోయిన వారి అంత్యక్రియలకు సైతం కుటుంబసభ్యులు నానా ప్రయాసలు పడాల్సి వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జ్వరం, ఆయాసంతో 37 ఏళ్ల ఓ వ్యక్తి మృతి చెందారు. శనివారం స్థానిక పీహెచ్ సీలో అతడికి కరోనా నిర్ధరణ పరీక్ష చేసి ఇంటికి పంపించగా.. అదే రోజు రాత్రి ఆయన మృతిచెందారు.
కనిపించని కన్నీళ్లు... పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు - తూర్పు గోదావరి జిల్లా వార్తలు
కరోనా కన్నీళ్లను సైతం కనబడకుండా చేస్తోంది. అంత్యక్రియలు సైతం పీపీఈ కిట్లు ధరించి చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందారు. శనివారం అతనికి కరోనా పరీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం ఆయన మృతి చెందారు. కరోనా లక్షణాలు ఉండడంతో బంధువులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేశారు.
కనిపించని కన్నీళ్లు...పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు
ఆదివారం వైద్య సిబ్బంది అతని ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు పీపీఈ కిట్లు అందజేశారు. వాటిని ధరించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి సంబంధించిన కరోనా నిర్ధరణ ఫలితం ఇంకా రావాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.
ఇదీ చదవండి :శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్ ఫ్రం హోం