'ఇసుక కొరతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు' రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో ట్రాక్టర్ ఇసుక 4 వేలు, లారీ ఇసుక 40 వేలకు పెరిగిందన్నారు. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక 38 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తే... వైకాపా మంత్రులు, నాయకులు తమపై ఎదురుదాడి చేస్తున్నారని లోకేశ్ అన్నారు. తూర్పు గోదావరిలో పర్యటించిన లోకేశ్... రాజమహేంద్రవరంలోని తెదేపా సీనియర్ నేత గోర్లంట బుచ్చయ్య చౌదరి ఇంటికి వచ్చారు. ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను లోకేశ్ పరామర్శించారు.