కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినా... కొందరు మారడంలేదు. భౌతికదూరం పాటించాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా... అవేవి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన... ఇద్దరిపై కేసు నమోదు - లాక్డౌన్ నిబంధలు ఉల్లంఘన..ఇద్దరిపై కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా తేటగుంట శివారు చెరవు వద్ద ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి చేపల కోసం ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేపల విక్రయదారులపై కేసు నమోదు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా తేటగుంట శివారు చెరవు వద్ద చేపల కొనుగోలుకు అనేక మంది ఎగబడ్డారు. మాస్కులు లేంకుడా, గుంపులుగా ఉండటంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దింతో చేపలు అమ్మే ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
TAGGED:
lock down rules break