తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుతపులి హల్ చల్ తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుతపులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న చిరుతను స్థానికులు గుర్తించారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన చిరుత గ్రామస్థులపై దాడి చేసింది. నలుగురికి గాయాలయ్యాయి. ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చిరుత గ్రామంలోని కొబ్బరి చెట్టు పైకి ఎక్కింది. ఘటనాస్థలిలో పోలీసులు, అటవీశాఖ అధికారులను మోహరించారు. రాజమహేంద్రవరం నుంచి మరికొంత మంది అటవీశాఖ సిబ్బంది వస్తున్నారు.