తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారి వద్ద ఆలమూరు బార్ అసోసియేషన్ చైర్మన్ సునీల్‌కుమార్ వలస కార్మికులకు భోజన ప్యాకెట్లు అందించారు. సుమారు 700 మందికి ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను సునీల్ కుమార్‌తో పాటుగా... సివిల్ కోర్టు న్యాయమూర్తి హెచ్ అమరరంగేశ్వరరావు పంపిణీ చేశారు. ఆపత్కాలంలో ఇటువంటి సేవలు చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. అలాగే బడుగువానిలంకలో సునీల్ కుమార్ ఇచ్చిన నిత్యావసర వస్తువులను అయిదు వందల కుటుంబాలు వారికి ఇంటింటికీ తిరిగి అందజేశారు.
వలస కార్మికులకు న్యాయవాదుల ఆపన్నహస్తం - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
జాతీయ రహదారిపై స్వస్థలాలకు పయనమైన వలస కార్మికులకు చెముడులంక జాతీయ రహదారి వద్ద న్యాయవాదులు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వలస కార్మికులకు భోజనాలు పంపిణీ