'చింతమనేనిని తప్పించండి' - chinthamaneni
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్... దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్సీ న్యాయవాదులు నిరసన చేపట్టారు. ప్రభాకర్‌ను తెదేపా నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
ఆందోళన చేస్తున్న ఎస్సీ న్యాయవాదులు
తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు ఆవరణలో ఎస్సీ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించారు.చింతమనేనిని తెదేపానుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటివరకూ ఆందోళక కొనసాగిస్తామని చెప్పారు.