తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు ఉల్లి మార్కెట్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించి జట్టు కూలీల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. రాజమహేంద్రవరం సీవీ మార్కెట్ జట్టు కూలీలు... తమ మార్కెట్లోకి వచ్చి తమ ఉపాధికి గండి కొడుతున్నారని దివాన్ చెరువు జట్టు కూలీలు ఆరోపిస్తున్నారు. ఇవాళ కూడా వీరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. కూలీలు సామాజిక దూరాన్ని మరిచిపోయి ఒకరికొకరు నెట్టుకొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపించేశారు. జట్టు కూలీలు సామరస్యంతో పని చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దివాన్ చెరువు మార్కెట్లో జట్టు కూలీల మధ్య ఉల్లి లొల్లి
కరోనా ఎక్కడ సోకుతుందోనని జనం బెంబేలెత్తిపోతుంటే వారికి మాత్రం అవేమీ పట్టడం లేదు. గొడవకు దిగి గుంపులు గుంపులుగా ఒకరినొకరు నెట్టుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఉల్లి మార్కెట్ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి జట్టు కూలీల మధ్య వివాదం జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి పంపించేశారు.
రాజానగరంలో జట్టుకూలీల మధ్య గొడవ