ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 19, 2020, 8:08 AM IST

ETV Bharat / state

కర్ఫ్యూ నీడలో కోనసీమ.. రోడ్డెక్కితే కేసు!

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కర్ఫూ అమలవుతోంది. దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

kufew in east godavari dst konasima  police strictly implementing
kufew in east godavari dst konasima police strictly implementing

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. నిబంధనలను అతిక్రమించి రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. దుకాణాలు అన్ని మూతపడ్డాయి. పాల డైరీలు సైతం తెరుచుకోలేదు.

సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది. దీనికి ప్రజలు సహకరించాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు. అమలాపురం డీఎస్పీ షేక్. మాసూం బాష పర్యవేక్షణలో పోలీసులు కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details