ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కచ్చులూరు బోటు : చిక్కినట్లే..చిక్కి చేజారింది ! - గోదావరి బోటు ప్రమాదం తాజా వార్తలు

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు జాడ తెలిసినా ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. ధర్మాడి సత్యం బృందం ఎంతలా శ్రమిస్తున్నా... ఫలితం దక్కడం లేదు. యాంకర్ పట్టు జారిపోవడంతో  బోటును ఒడ్డుకు చేర్చటం కష్టతరమైంది. డీప్‌ డైవర్ల సాయంతో బోటుకు కొక్కేలు బిగించాలని సత్యం బృందం భావిస్తోంది.

చిక్కినట్లే..చిక్కి చేజారింది !

By

Published : Oct 19, 2019, 11:25 PM IST

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి 34 రోజులు గడుస్తున్నా... బోటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. నిన్న లంగరుకు చిక్కిన బోటు పట్టు తప్పడంతో నీటిలోనే ఉండిపోయింది. బోటు ఒడ్డుకు చేరకపోయినా..... సుమారు 75 అడుగులు ముందుకు కదిలిందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది. నీటిలో ఇసుక మేటలు, మట్టిదిబ్బలు ఉండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. . నది లోపలకి వెళ్లి బోటుకు కొక్కేలు బిగిస్తే బోటు బయటకు వచ్చే అవశాశం ఉండటంతో ఈ మేరకు...చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి డీప్ డైవర్లను రప్పించే ప్రయత్నాలను మెుదలుపెట్టారు.

శనివారం సాయంత్ర వరకూ వెలికతీత పనులు కొనసాగించిన ఫలితం లేకుండా పోయింది. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షణలో వెలికితీత పనులను నిర్వహించారు. నదిలో వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోగా.. బోటు 30 నుంచి 40 అడుగుల లోతులోనే ఉందని సత్యం బృందం స్పష్టంచేసింది. బోటు 44 టన్నులకు పైగా బరువు ఉండటం, లోపల ఇసుక మేటలు వేయడంతో ఒడ్డుకు చేర్చడం కష్టమవుతోందని తెలిపారు.

చిక్కినట్లే..చిక్కి చేజారింది !

ABOUT THE AUTHOR

...view details