ఎడతెరిపి లేని వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న వరద ఉద్ధృతికి ఎటూ వెళ్లలేక తెలియక బిక్కుబిక్కుమంటూన్నారు. పక్క ఇంటికి వెళ్లటానికి కూడా పడవలను ఉపయోగించవలసి వస్తుందంటే, వరద ప్రవాహం లంక గ్రామాలను ఏ విధంగా ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల వచ్చి సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చి వెళ్లిపోతున్నారని తరువాత తమ వైపు చూడటం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా ఆదుకోకుండా మరలా వరద వస్తే ఈ విధంగా ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు వరద ప్రవాహానికి పాడయిపోయాయని తమకు ఎగువ ప్రాంతంలో స్థలాల పట్టాలిస్తే అక్కడ ఇళ్లు కట్టుకుంటామని ప్రభుత్వానికి లంక గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరద గుప్పిట్లో కోనసీమ - undefined
ఉగ్ర గోదావరికి లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రాణాలరచేత పట్టుకొని ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వరద గుప్పిట్లో కోనసీమ