Kartikamasam: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా గోదావరి జిల్లాలలోని నదీ తీరాలు, కాలువలు భక్తులతో సందడిగా మారాయి. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి మహిళలు తీరాలలో దీపారాధనలు, పూజలు నిర్వహించారు.
Kartikamasam: కార్తీకమాసం ప్రారంభ వేళ... భక్తుల సందడి - కార్తీకమాసం ప్రారంభ పూజలు
Kartikamasam: కార్తీకమాసం ప్రారంభ వేళ గోదావరి తీరం భక్తులతో పులకించింది. రాజమహేంద్రవరంలోని వివిధ ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర్ ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. నిన్న సూర్యగ్రహణం రావడంతో.. నేడు అధిక సంఖ్యలో గోదావరి స్నానాలకు తరలి వచ్చారు. పాడ్యమి స్నానం చేసి.. దీపాలు వెలిగించారు. భక్తి శ్రద్ధలతో నదిలో దీపాలు వదిలారు. అనంతరం పరమేశ్వరుడి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని సుబ్బారాయుడు కాలువతీరం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. మహిళలు.. కార్తీక మాసం ప్రారంభ శుభ సూచకంగా దీపారాధన చేసి పూజలు చేశారు. అరటి దొప్పలలో వెలిగించిన దీపాలను కాలువల్లో వదిలారు. కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధనలు చేయడం వల్ల తమ పసుపు కుంకములు కాపాడబడతాయని, తమ కాపురం సుఖసంతోషాలతో ముందుకు సాగుతుందని భక్తులు నమ్ముతారు. కాలువలో దీపాలు వదిలిన అనంతరం తీరంలో ఉన్న దేవాలయంలో పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ తణుకు గోస్తనీ కాలువ, అత్తిలిలోని పెద్ద కాలువ తీరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేశారు.
ఇవీ చదవండి: