హజరత్ మహబూబ్ సుబానీ, కరీముల్లాషా ఖాదరి దర్గా 60వ గంధ మహోత్సవాన్ని రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. జైలు రోడ్డులోని దర్గాలో కమిటీ సభ్యులు గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఘనంగా కరీముల్లాషా ఖాదరి దర్గా గంధ మహోత్సవం - తూర్పు గోదావరి జిల్లా తాజా వార్తలు
రాజమహేంద్రవరంలో హజరత్ మహబూబ్ సుబానీ, కరీముల్లాషా ఖాదరి దర్గా 60వ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దర్గా కమిటీ సభ్యురాలు హజీన్ని సయ్యద్ అమిరున్నీసా ఆధ్వర్యంలో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఘనంగా కరీముల్లాషా ఖాదరి దర్గా 60వ గంధ మహోత్సవం
దర్గా ఉత్సవాల్లో ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనారిటీలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మహోత్సవంలో ప్రముఖ హాస్య నటుడు ఆలీ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ... ఇతర పనుల కారణంగా ఆయన రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం