ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాతృభాషను చంపేస్తామంటే ఊరుకోం' - latest news on telugu

తెలుగు భాషపై వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను చంపేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలుగు భాషపై కాలవ శ్రీనివాసులు

By

Published : Nov 11, 2019, 2:47 PM IST

ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను చంపేస్తామంటే ఊరుకునేది లేదని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగు మాధ్యమంపై వైకాపా సర్కారు అనాలోచిత, ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషకు నామరూపాల్లేకుండా చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.

తెలుగు భాషపై ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయమన్న కాల్వ శ్రీనివాసులు

ABOUT THE AUTHOR

...view details