కాకినాడలో శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన బాలిక ఆచూకీ కోసం... పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నగరంతో పాటు కాకినాడ గ్రామీణ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు జాగిలాలతో గాలిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం జగన్నాథపురంలోని నేతాజీ నగరపాలక సంస్థ పాఠశాలలో ఆడుకుంటున్న... ఏడేళ్ల బాలిక దీప్తిని ఓ మహిళతోపాటు మరో వ్యక్తి అపహరించారు. ఈ వ్యవహరంపై వన్ టౌన్ పోలీసులకు బాలిక తండ్రి సత్యశ్యాంకుమార్ ఫిర్యాదు చేశారు.
బాలిక కిడ్నాప్... రంగంలోకి ధర్మాడి సత్యం..! - కాకినాడలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ న్యూస్
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని... గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సవతి తల్లి శాంతకుమారిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాలికను చంపేశారని జోరుగా వదంతులు వ్యాపించాయి. దీంతో ఇంద్రపాలెంలాకులు, ఉప్పుటేరుల వద్ద కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కచ్చులూరు వద్ద మునిగిన పర్యాటకబోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంతోనూ ఉప్పుటేరు వద్ద గాలించారు. ఇప్పటివరకూ దీప్తి శ్రీ ఆచూకీ లభ్యం కాలేదు. అసలు బాలిక ప్రాణాలతో ఉందా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది. బాధిత కుటుంబంలో ఆందోళన పెంచుతోంది.
ఇదీ చదవండి: కాకినాడలో కలకలం... ఏడేళ్ల బాలిక అపహరణ