ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో కార్పొరేటర్ హత్య.. 'పాత కక్షలే కారణం' - kakinada corporater murder latest news

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేటర్ కంపర​ రమేశ్​ను కారుతో ఢీకొట్టి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు వివరించారు.

murder
కార్పొరేటర్​ రమేష్

By

Published : Feb 12, 2021, 8:13 AM IST

Updated : Feb 13, 2021, 5:05 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేటర్‌ హత్య కలకలం రేపింది. కాకినాడ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్ ను అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి హతమార్చారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కార్పొరేటర్‌ రమేష్‌, అతని స్నేహితులు సతీష్‌, వాసులతో కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్‌ ఫోన్‌ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. తన తమ్ముడి పుట్టిన రోజు అని, కేక్‌ కటింగ్‌కు రావాలని చిన్నా ఆహ్వానించగా .. రమేష్‌ తిరస్కరించారు.

అంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేష్‌ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు. కార్పొరేటర్‌ను హత్య చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.

Last Updated : Feb 13, 2021, 5:05 AM IST

ABOUT THE AUTHOR

...view details