ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్.. కుల రాజకీయాలు చేస్తున్నారు: జీవీఎల్

పవన్ కల్యాణ్.. కుల రాజకీయాలకు తెరలేపారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేనను కులసేన అని సంబోధిస్తే సముచితం అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

By

Published : Apr 2, 2019, 2:51 PM IST

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుల రాజకీయాలకు పరిమితమయ్యారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. జనసేనను కులసేన అని పిలిస్తే సముచితం అనిపిస్తోందని రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ చంద్రబాబుమేలు చేయలేదన్నారు. పోలవరం గుత్తేదారులపై మాత్రం ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబుకు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. రాష్ట్రంలో భాజపా బలీయమైన శక్తిగా ఎదుగుతుందనడానికి ప్రధాని మోదీ సభలకు వస్తున్న ప్రజాదరణే నిదర్శమని చెప్పారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details