కరోనా తరుముతున్న వేళ.. పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రుల్లో ఆందోళన వాస్తవమే. ఈ నేపథ్యంలో.. నవంబరు 2 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ తెరుచుకోనున్నాయి. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు పాఠ్యాంశాలు బోధించేందురు చర్యలు పూర్తయ్యాయి. పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థిని జాగ్రత్తగా చూసుకుంటామని.... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు సాగేలా చూస్తామని తూర్పుగోదావరి జిల్లా విద్యాధికారి ఎస్.అబ్రహం పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల పునఃప్రారంభం వేళ తరగతుల నిర్వహణకు చర్యలు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై ‘ఈనాడు’, ఈటీవీ భారత్తో మాట్లాడారు.
ప్ర: వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, పిల్లలు ఒకచోట చేరితే ఇబ్బంది కదా?
డీఈవో: 1-10 వరకు అన్ని యాజమాన్యాల కింద 7,416 పాఠశాలల్లో 7,47,225 మంది ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 18,419 మందిలో 14 వేల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 139 మందిలో పాజిటివ్ గుర్తించాం. వీరు మినహా మిగిలిన వారిని బోధనకు అనుమతిస్తాం. 3 వేల మంది బోధనేతర, మధ్యాహ్న భోజన సిబ్బంది ఉన్నారు. మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండ్రోజుల్లో కొవిడ్ పరీక్షలు పూర్తి చేస్తాం. పిల్లలకు థర్మల్ స్క్రీనింగ్ చేశాకే గదిలోకి అనుమతిస్తాం. సచివాలయ పరీక్షలకు కొనుగోలు చేసిన థర్మల్ మీటర్లు జేసీ సమకూరుస్తున్నారు. మిగిలినవి కొనే ఏర్పాట్లు చేశాం.
ప్ర: పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇస్తారు?
డీఈవో: విద్యాసంవత్సరం కోల్పోకూడదనే పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరదర్శన్లో ‘విద్యావారధి’ ద్వారా 1-10 వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నాలుగు తరగతులను ప్రసారం చేస్తోంది. అందరూ దృష్టి పెడుతున్నారో లేదో చెప్పలేం. అందుకే ప్రత్యక్ష తరగతుల ద్వారా చదువులు చెప్పి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర:తరగతుల నిర్వహణ ఎలా?
డీఈవో:ఒకరోజు తొమ్మిదో తరగతికి, మర్నాడు పదో తరగతికి.. ఇలా రోజు మార్చి రోజు బోధిస్తాం. ఒక గదిలో 16 మందే ఉంటారు. బెంచీకి ఒకరు చొప్పున కూర్చునే ఏర్పాటు చేస్తున్నాం. తరగతులయ్యాక శానిటైజేషన్, శుభ్రతను ప్రధానోపాధ్యాయులే చూస్తారు.
ప్ర:విద్యాకానుక కిట్ల పంపిణీ, పాఠ్యపుస్తకాల అందజేత పూర్తయిందా?