ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పొంగుతున్న ధవళేశ్వరం.. వరదలో చిక్కుకున్న లంకగ్రామాలు - yanam village

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు భారీగా విడిచిపెట్టడంతో కోనసీమలోని గోదావరి నది పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. ఇసుక ర్యాంపులలోని బాటలు సైతం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

వరదలో చిక్కుకున్న లంకగ్రామాలు
వరదలో చిక్కుకున్న లంకగ్రామాలు

By

Published : Jul 25, 2021, 7:07 PM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి లోకి నీళ్లు విడుదల చేయడంతో రావులపాలెం మండలంలోని గౌతమీ, వశిష్ఠ వంతెన వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది.

ఇసుక ర్యాంపులలోని బాటలు సైతం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రైతులు పంట పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో గోదావరి చెంతనే ఉన్న లంక పొలాలు ఇప్పటికే నీటమునిగాయి. గోదావరికి వరద నీరు మరింత చేరితే లంక ప్రాంతాల్లోని పంటపొలాలు పూర్తిగా మునిగిపోతాయని పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పడవలలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details