దేశంలో దళితులపై అత్యాచారాల తీవ్రత ఎక్కువగా ఉందని దళిత సంఘాల నాయకులు అర్జరపు వాసు అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనను వ్యతిరేకిస్తూ... తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దోషులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
అనంతరం లాలా చెరువు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసరకారులను పోలీసులు బొమ్మూరు స్టేషన్కు తరలించారు.