ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే బిల్లుపై రెండోసారి ఇసుక తరలిస్తున్న లారీ సీజ్ - ఒకే బిల్లుపై రెండుసార్లు ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

ఒకే బిల్లుపై రెండుసార్లు ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు... తనిఖీలో పట్టుకున్నారు. డ్రైవర్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

east godavari district
ఒకే బిల్లుపై రెండుసార్లు ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

By

Published : Jun 30, 2020, 10:31 PM IST

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో గున్నయ్య తూము దగ్గర... ఒకే బిల్లుపై రెండు సార్లు ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. ఇంచార్జ్ ఎస్ఐ, పామర్రు ఎస్ఐ, వారి సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు.

లారీ డ్రైవర్ సలాది మణికంఠ (25) ను ప్రశ్నించగా.. విషయం బయటపడింది. ఇలా రెండోసారి తెచ్చిన ఇసుకను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీఎస్పీ ఎస్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ్రైవర్ ను అరెస్ట్ చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details