ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide Attempt: సామాజిక మాధ్యమాల్లో భార్య అసభ్య దృశ్యాలు.. పిల్లలకు విషమిచ్చి.. తానూ - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు

Husband Suicide Attempt Over Wife Obscene Scenes on Social Media: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్​ స్టేషన్ పరిధిలో శనివారం విషాదం జరిగింది. వంగలపూడికి చెందిన ఓ వ్యక్తి..​ విషం తాగి, పిల్లలతోనూ తాగించాడు. ప్రస్తుతం అతడితో పాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తానూ మనస్తాపానికి గురై ఇలా చేశానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంటులో చెప్పాడు.

husband suicide attempt over Wife obscene scenes
husband suicide attempt over Wife obscene scenes

By

Published : Jan 17, 2022, 8:57 AM IST

Wife obscene scenes on social media: తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. విషం తాగి, పిల్లలతోనూ తాగించాడు. అతడితో పాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వంగలపూడిలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సీతానగరం ఎస్సై శుభశేఖర్‌ వెల్లడించారు.

వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటుంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో, ఇద్దరు కుమారులు (13, 10) కుమార్తె (12) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు వెళ్లి పిల్లల్ని చూస్తుంటాడు. శనివారం సాయంత్రం పండగ పేరుతో వంగలపూడి వచ్చిన తండ్రి.. తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. తోటల్లోకి తీసుకెళ్లి ముందుగా తాను ఎలుకల మందు తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించే ప్రయత్నం చేశాడు.

అపస్మారక పరిస్థితికి చేరుకోవడంతో

అందులో పదేళ్ల చిన్న కుమారుడు మందు తాగేశాడు. మిగతా ఇద్దరు తాగలేదు. ఇంతలో అతడు అపస్మారక పరిస్థితికి చేరుకోవడంతో ఆ ఇద్దరు పిల్లలను వదిలేశాడు. కొద్దిసేపటికి వారిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరి బాధితులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

మాధ్యమాల్లో ఆ వీడియో రావడంతోనే..

సమీప బంధువుల నుంచే సామాజిక మాధ్యమాల్లో వీడియో వచ్చిందని, దాంతో తాను మనస్తాపానికి గురై ఇలా చేశానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంటులో చెప్పాడు. అయితే అతడు చెబుతున్న వీడియోలను ఇంకా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఆటో నడుపుతాడని, గతంలో చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో అతడిపై కేసులు ఉన్నాయని ఎస్సై తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చేదుమందు తాగించబోయాడు..

‘నాన్న ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోడు. అమ్మమ్మ ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాం. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడు. అలాగే పండగకు వచ్చాడనుకుని బయటకు వెళ్దామంటే బయలుదేరాం..’ అని మిగతా ఇద్దరు పిల్లలు చెప్పారు. బలవంతంగా తమతో ఏదో చేదు మందు తాగించే ప్రయత్నం చేశాడని, తామిద్దరం నిరాకరించగా.. తమ్ముడు తెలియకుండానే తాగేశాడని వివరించారు.

ఇదీ చదవండి..

గోదారి అమ్మాయి వయసు 18.. అభిమానులు 10లక్షలు

ABOUT THE AUTHOR

...view details