ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో దూకి.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల గల్లంతు - నదిలో దూకి భార్యాభర్తలు

తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన భార్యాభర్తలు శనివారం తమ ఇద్దరు పిల్లలతో సహా చంచినాడ వారధిపై నుంచి దూకి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నా అనుకున్న వారే తమను మోసం చేశారని.. అందుకే చనిపోతున్నట్లు వాళ్ల రాసిన లేఖ, ఆడియో సామాజిక మాద్యమాల్లో వైరల్​ అయింది.

Husband and wife jump into a river at west godavari
నదిలో దూకి భార్యాభర్తలు

By

Published : Aug 1, 2021, 4:39 AM IST

Updated : Aug 1, 2021, 11:14 AM IST

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ, ఆడియో కలకలం సృష్టిస్టున్నాయి. యలమంచిలి మండలం చించినాడ వారధిపై వారి ద్విచక్రవాహనం, చిన్నారుల దుస్తులు వదిలేశారు. వాహనం, దుస్తులు.. శనివారం ఉదయం గోదావరి వారధిపై కనిపించడంతో వశిష్ఠ నదిలో దూకి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్విచక్ర వాహనం, దుస్తువులను యలమంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుటుంబ కలహాలే ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి కారణమన్నట్లు తెలుస్తోంది. మా కుటుంభికులే మమ్మల్ని మోసం చేశారని... దీంతో తన భర్త పిల్లలతో చనిపోతున్నట్లు ఓ లేఖ, ఆడియో సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Last Updated : Aug 1, 2021, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details