మనం ఎన్నో రకాల సంతలను చూసుంటాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో గురు, శుక్రవారాల్లో జరిగే సంతకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కేవలం పందెం కోళ్లను మాత్రమే విక్రయిస్తుంటారు. డేగ, పచ్చకాకి, పువ్వులు, కేతువా, రతంగి, నాలజవుల, పెంగల వంటి జాతుల కోళ్లు ఇక్కడ దొరుకుతాయి. జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది కోళ్లను కొనేందుకు ఇక్కడకు వస్తుంటారు.
ఇదోవింత... పందెంకోళ్లకూ ఓ సంత!
కూరగాయల సంతను చూశాం. పశువుల సంతనూ చూశాం. కానీ పందెంకోళ్ల సంతను ఎప్పుడైనా చూశారా! ఒక్కసారి కోరుకొండకు వెళితే అది మీ కళ్లకు తడుతుంది. డేగ నుంచి పెంగల వరకూ ప్రతీరకం కోడి అక్కడ తారస పడుతుంది. సంతలో కోళ్లు కూడా దొరికితే ఓకే!... కానీ కేవలం పందెంకోళ్ల కోసమే సంతంటే.. ఇది నిజంగా వింతేకదండీ!?
hens
ఈ సంతలో మేలైన జాతి కోళ్లను విక్రయించడం ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. వీటికి ఎలాంటి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు సైతం తీసుకుంటారు.