ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుండపోత వర్షానికి దేవీపట్నంలో గోదావరి ఉగ్రరూపం - రంపచోడవరంలో భారీ వర్షాల వార్తలు

కుండపోతగా కురిసిన వర్షానికి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పలు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

heavy rains in rampachodavaram east godavari district
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

By

Published : Jul 1, 2020, 12:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వర్షానికి కొండ వాగులు పొంగి ప్రవహించాయి. మండలంలోని వాడపల్లి వెళ్లే రహదారిలో పలు వాగులు ఉద్ధృతంగా మారాయి. గంగవరం మండలంలో జువ్వమ్మ కాలువ, బురద కాలువ నిండుగా ప్రవహించటంతో రాకపోకలు స్తంభించాయి.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్ల దేవీపట్నంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరో 2 రోజులు ఇలాగే వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details