కోనసీమలో జోరు వాన... గంటసేపు భారీ వర్షం - kothapeta
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. జోరు వానతో ఎంతో రద్దీగా ఉండే కళా వెంకట్రావ్ సెంటర్ సైతం వాహనాల తాకిడి లేక నిర్మానుష్యంగా మారింది.
'కోనసీమలో ఈదురుగాలుల వర్షం'
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏకదాటిగా సుమారు గంట సేపు వర్షం పడింది. ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం కాస్తా ఒక్కసారిగా కారు మబ్బులతో చీకటిగా మారింది. వాహనదారులు వాహనాల లైట్ల వెలుతురులో ప్రయాణం సాగించాల్సిన వచ్చింది.