ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీలకంఠేశ్వరుడికి.... వరదాభిషేకం!

గోదారమ్మ ఇంకా శాంతించలేదు. పరవళ్లు తొక్కుతూనే ఉంది. రాజమహేంద్రవరంలో వరద ఉధృతికి నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. గోదావరి గట్టు పక్కన ఉన్న ఎనిమిది కుటుంబాలు రొడ్డున పడ్డాయి.

heavy_floods_in_rajamaundry

By

Published : Aug 11, 2019, 1:35 PM IST

నీలకంఠేశ్వరుడికి....వరదాభిషేకం!

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలోవరద ఉదృతి ఎక్కువగా ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న ఆల్కాట్ గార్డెన్స్ వద్దనున్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. స్వామి విగ్రహానికి జలాభిషేకం జరుగుతున్నట్టే ప్రవాహం కొనసాగుతుండడం.. ఆకట్టుకుంటోంది. ఇదే ప్రాంతంలో గోదావరి గట్టు పక్కన కొన్నేళ్ల నుంచి నివాసం ఉంటున్న 8 కుటుంబాలకు సంబంధించిన పాకలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలు గోదావరి గట్టుపైనున్న రోడ్డుపైనే పాక వేసుకున్నారు. వరద పెరిగినా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details