ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాటల ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తున్న హెడ్​కానిస్టేబుల్

కరోనా నియంత్రణలో భాగంగా అధికారులు విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాజాత రూపాల్లోనూ ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో... స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ప్రత్యేక రీతిలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు ఓ హెడ్​కానిస్టేబుల్​. ఒకవైపు విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూ.. అధికారుల మన్ననలు పొందుతున్నారు.

By

Published : May 31, 2021, 8:36 AM IST

awareness program
కరోనాపై అవగాహన కార్యక్రమం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్​స్టేషన్​లో హెడ్​కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఎం.కె.రత్నం పాటల ద్వారా కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. తానే స్వయంగా పాటను రచించి.. పాడుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, తాను రచించిన పాటలను ఆలపించారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆయన ఇప్పటివరకు ఆరు పాటలు రాశారు. ఓ విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహమ్మారిపై పోరాటానికి తన వంతు కృషి చేస్తున్న హెడ్​కానిస్టేబుల్​ను పోలీసు అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details