తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో ప్రతి ఏటా సంభవించే గోదావరి వరదల వల్ల గౌతమి గోదావరి ప్రవాహానికి రాజీవ్ బీచ్ ప్రాంతం, లంక భూములు కోతకు గురవుతున్నాయి. ఈ నష్ట నివారణ కోసం ఐదేళ్ల క్రితం రూ. 180 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పుదుచ్చేరి ప్రభుత్వం టెండర్లు పిలవగా... పనులు చేపట్టేందుకు రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడీ ఆమోదం తెలపింది. అయితే ఈ పనుల్లో పూరోగతి కనిపించలేదు.
వరద నష్ట నివారణకు ఇంజనీర్లు బృందం పరిశీలన - యానంలో ఇంజినీర్ల బృందం
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో ప్రతి ఏటా సంభవించే గోదావరి వరదల వల్ల భూములు కోతకు గురవుతున్నాయి. ఈ నష్ట నివారణ కోసం చేపట్టవలసిన నిర్మాణాలను పరిశీలించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం నియమించిన ఇంజినీర్ల బృందం యానం చేరుకుంది. గౌతమీ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించింది.
ప్రజల వరదల సమయంలో తీవ్ర అసౌకర్యాలకు గురికావడం, సుమారు 2 వేల కుటుంబాలు ఆర్ధికంగా నష్టపోతున్నారని స్థానిక శాసనసభ్యులు, పుదుచ్చేరి రాష్ట్రమంత్రి మల్లాడి కృష్ణారావు గత నెలలో వచ్చిన వరదల దృశ్యాలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. నలుగులు ఇంజనీర్ల బృందం... 16 కిలోమీటర్ల పొడవున్న గౌతమీ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. వరద కారణంగా ఏర్పడే నష్ట నివారణకు చేపట్టవలసిన నిర్మాణాలపై పరిశీలిస్తున్నారు. నివేదికను త్వరలో పుదుచ్చేరి ప్రభుత్వానికి అందించనున్నారు.