కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రాజరాజేశ్వరీ సమేత రాజేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలను మాజీమంత్రి మల్లాది కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి, పట్టు వస్త్రాలను యానాం మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ, మంగళ సూత్రాలను దేవస్థానం అధ్యక్షులు కాపుగంటి ఉమాశంకర్ సమర్పించారు. అనువంశిక ఉత్సవదారులైన రాజమహేంద్రవరం నగరానికి చెందిన రాజా మాన్యం కనకయ్య జమిందార్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు కల్యాణ విశిష్టతను వివరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొన్నారు.
యానాంలో రాజరాజేశ్వరీ సమేత రాజేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం - yanam latest news
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రాజరాజేశ్వరీ సమేత రాజేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు హాజరయ్యారు.
ఘనంగా రాజరాజేశ్వర సమేత రాజేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం