తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని పుష్పక వాహనంపై ఉరేగింపుగా తీసుకొచ్చి, స్థానిక చెరువులో సిద్ధం చేసిన హంసవాహనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య స్వామివారి తెప్పోత్సవం చేపట్టారు. స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
కన్నులపండువగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం - east godavari district latest news
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక చెరువులో ఏర్పాటు చేసిన హంసవాహనంపై స్వామివారిని ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
కన్నులపండువగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం