ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సోడియం హైపో క్లోరైడ్​ టన్నెళ్లు ఆపండి'

సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణ కేంద్రాలను మూసివేయాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని కోరారు. వైరస్​ను నివారించకపోగా.. ఈ ద్రావణంతో దుష్ప్రభావాలు ఉన్నాయన్నారు.

By

Published : Apr 12, 2020, 5:12 PM IST

gorantla on hypo chloride solution
సోడియం హైపోక్లోరైడ్​ టన్నెళ్లపై గోరంట్ల ట్వీట్​

సోడియం హైపో క్లోరైడ్‌ వల్ల దుష్పలితాలు వస్తున్నాయని... వెంటనే ద్రావణ కేంద్రాలను మూసివేయాలని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రభుత్వానికి సూచించారు. సోడియం హైపో క్లోరైడ్‌ కరోనాపై పని చేయకపోగా ప్రజలపై స్ప్రే చేస్తుంటే.. మనుషులకు చికాకు, గొంతు మంట, దగ్గు వస్తున్నాయన్నారు. బర్నింగ్‌ పెయిన్, మంట, వాపు, బొబ్బలు రావడం లాంటివి ఏర్పడి దుష్పలితలు వస్తున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. కాబట్టి స్ప్రే కేంద్రాలను ఆపాలని గోరంట్ల ప్రభుత్వాన్ని కోరారు.

సోడియం హైపోక్లోరైడ్​ టన్నెళ్లపై గోరంట్ల ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details