ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదలుతున్నారు. వరద కారణంగా.. కోనసీమలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రావులపాలెంలోని గౌతమీ గోదావరి, గోపాలపురంలోని వశిష్ట గోదావరి పాయలు నీటితో ఉరకలేస్తున్నాయి. ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని భూములు కోతకు గురయ్యాయి. వరద ఉధృతికి అరటి తోటలు ధ్వంసమయ్యాయి.
పొటెత్తిన గోదావరి.. భయం గుప్పిట్లో లంక ప్రజలు - east godawari
గోదావరి నదికి వరదనీరు పొటెత్తుంది. తూర్పూగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అరటి తోటలు ధ్వంసమై...రైతులకు ఆవేదన మిగిలింది.
పొటెత్తిన గోదావరి