రాజమహేంద్రవరం వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 15.2 అడుగులకు చేరింది. గోదావరిలో వరద ఉద్ధృతితో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి 14.81 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ముంపులోనే గ్రామాలు
ఉగ్ర గోదావరి పోటెత్తటంతో పోలవరం ఎగువ ప్రాంతంలోని గ్రామాలు నదీ ప్రవాహంతో నిండిపోయాయి. గ్రామాలు నదిలో కలిసిపోయినంతగా వరద గోదావరి ప్రవహిస్తోంది. నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలను రక్షించేందుకు సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.