గోదావరి మళ్లి ఉగ్రరూపం దాల్చుతోంది.రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ధవళేశ్వరం ఆనకట్ట వద్ద11.8అడుగులకు నీటిమట్టం చేరింది.ధవళేశ్వరం ఆనకట్టకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.సముద్రంలోకి10లక్షల5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.మేడిగడ్డతో పాటు ప్రాణహిత,ఇంద్రావతి,శబరి ఉపనదులు నుంచి భారీగా గోదావరిలోకి వరద నీరు చేరుతోంది.వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మళ్లీ పోటెత్తుతోన్న ఉగ్రగోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక - రాజమహేంద్రవరం
ధవళేశ్వరం వద్ద గోదావరి మళ్లీ పోటెత్తుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార్లు హెచ్చరిస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది