ఉగ్రగోదావరి శాంతించటం లేదు.భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరగటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
వరద గుప్పెట్లో...
గోదవారి ఉగ్రరూపానికి తూర్పు మన్యం విలవిల్లాడుతోంది. నది పరివాహక ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జనం వణికిపోతున్నారు. ఆరు రోజులుగా వరదలు దేవీపట్నం మండలాన్ని చుట్టేయటం వల్ల వరదనీటిలో ప్రజల కష్టాలు పడుతున్నారు. దేవీపట్నం, పూడిపల్లి, తొయ్యేరు తదితర గ్రామాలన్నీ నీటిలోనే చిక్కుకుపోయాయి. 36 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కరెంటు స్తంభాలు నీట మునగటంతో ప్రజలు అధకారంలోనే కాలం వెల్లదీస్తున్నారు.
సాయం కోసం ఎదురుచూపులు
ఆహారం, తాగునీరు కోసం ప్రజలు అలమటిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితులు దయనీయంగా మారిందన్నారు. ఎన్నో వరదలు ఎదుర్కొన్నాం కానీ...ఇంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టసమయంలో తమను ఆదుకోకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సముద్రంలోకి నీటి విడుదల
ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి 10.78 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా కాటన్ బ్యారేజీలో ప్రస్తుతం 12.3 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది. డెల్టా కాల్వలకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 43.2 అడుగులుగా కొనసాగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
మంపు ప్రాంతాల్లో గోదా'వర్రీ'...కొనసాగుతున్న వరద
గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నదీ ప్రవాహం కొద్దిసేపు తగ్గినా...భద్రాచలం వద్ద ప్రవాహం మరలా పెరిగంది. దింతో ధవళేశ్వరం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రవాహం కారణంగా గోదావరి పరివాహక ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
మంపు ప్రాంతాల్లో గోదా'వర్రీ'
ఇదీచదవండి