రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 10.03 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.80 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ముంపు మండలాల్లో సహాయ చర్యలకోసం విపత్తుల శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పడవలు, బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు, స్నానానికి వెళ్లవద్దని విపత్తుల శాఖ హెచ్చరించింది.