వశిష్ఠ పొంగింది... పల్లె మునిగింది... - తూర్పుగోదావరి జిల్లా
లంక గ్రామాల ప్రజలను గోదావరి వరద తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కోనసీమలోని చాలా పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్న 4 పల్లెల జనం పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
వశిష్ఠ పొంగింది... పల్లె మునిగింది...
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని జీ పెదపూడి లంక, అరిగెలవారి పేట, బూరుగు లంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నది మధ్యలో ఉన్నాయి. గోదావరి వరద కారణంగా బయటకు వెళ్లాలంటే కొంత దూరం పడవ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొంత దూరం నీటిలోనే నడవాల్సిన దుస్థితి. ఇక్కడ వంతెన నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.