ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద తగ్గుతోంది.. బురద తేలుతోంది - loss

భారీ వరదతో మన్యాన్ని ముంచేసిన గోదావరి.. నెమ్మదిగా శాంతిస్తోంది. మన్యం వాసులు ముంపు నుంచి బయటపడుతున్నారు.

దేవిపట్నం

By

Published : Aug 12, 2019, 8:24 PM IST

మన్యంలో తగ్గుతున్న గోదారి.. తేరుకుంటున్న ప్రజలు

భారీ వరద ప్రవాహాలతో తూర్పు మన్యాన్ని ముంచేసి జనాన్ని గడగడలాడించిన గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. దేవీపట్నం మండలంలోని ముంపు ప్రాంతాల ప్రజలు.. శిబిరాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. పలు గ్రామాల్లోని ఇళ్లు, గోడలు వరదపోటుతో కూలిపోయాయి. పూడిపల్లి, వీరవరం, తొయ్యేరు, రమణయ్యపేట, దేవీపట్నం తదితర గ్రామాల్లో పూరిళ్లన్నీ దెబ్బతిన్నాయి. ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. సామన్లు ధ్వంసమయ్యాయి. వీటిని చూసి యజమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. దండంగి వద్ద సీతపల్లి వాగుపై ఇంకా వరదనీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల ప్రజలు పడవలనే రాకపోకలకు ఆశ్రయిస్తున్నారు. వీరవరం - తొయ్యేరు, తొయ్యేరు - దేవిపట్నం మధ్య వరదనీరు ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో.. పడవలను నిలిపేశారు. విధిలేని పరిస్థితుల్లో ప్రజలు నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ దేవిపట్నం వెళ్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details