ఆలమూరు మండలం బడుగువాణి లంక ఇంకా ముంపు నీటిలోనే ఉంది. ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లోని పంట పొలాలు సైతం నీటిలో మునిగిపోయాయి. అతికష్టం మీద రైతులు పంట ఉత్పత్తులను బయటకు తెచ్చుకుంటున్నారు.
గోదావరి ముంపు ప్రాంతాల్లో పడవలపైనే రాకపోకలు - ఆలమూరు మండలం తాజా వరద సమాచారం
గోదావరి వరద ఉద్ధృతి కారణంగా ముంపు ప్రాంత ప్రజలు వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం వల్ల ఇంకా పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
ముంపులోనే రాకపోకల సాగింపు