అపరిశుభ్ర వాతావరణం వల్లే తమ కూతురు చనిపోయిందని,తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలోని ఓ కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. 5రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నిఖిత,మండపేట ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జ్వరం తగ్గలేదు.నిఖితను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా,ఆరోగ్యం విషమించడంతో బాలిక మృతి చెందింది.దీంతో బాలిక చనిపోవడానికి తమ ప్రాంతంలోని అపరిశుభ్రత వాతావరణం,మురుగునీరే కారణమని కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోకపోతే,మరెందరో నిఖితలు చనిపోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అపరిశుభ్రతే కారణం,మృతదేహంతో బందువుల ఆందోళన - మండపేట
విషజ్వరంతో తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన 13ఏళ్లబాలిక మృతిచెందింది. తమ ప్రాంతంలోని అపరిశుభ్రవాతవరణమే బాలిక ప్రాణాలను బలిగొందని, బాధిత బందువులు బాలిక మృతదేహంతో రహదారిపై ఆందోళనకు దిగారు.
ఆసుపత్రిలో అపరిశుభ్రతతో అసువులు బారిన బాలిక