తూర్పు గోదావరి జిల్లాలో వరద ముంపునకు గురైన లంక గ్రామాలలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పర్యటించారు. నీటిలో మునిగిన నాగుల్ లంక, అప్పనపల్లి, శివలంక, కాట్రగడ్డ ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. వరదల సమయంలో అందరు అప్రమత్తంగా ఉండాలని ఆయన లంకప్రజలకు ధైర్యం చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. లంక గ్రామ ప్రజలకు వీలైనంత ఎక్కువగా సాయం అందేలా చూస్తానని కొండేటి హామీ ఇచ్చారు.
పి.గన్నవరం లంకగ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - east gopdavari district
వరదలో చిక్కుకున్న లంకగ్రామాల్లో పి. గన్నవరం ఎమ్మెల్యే పర్యటించారు. బాధితులకు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందేలాచేస్తామని హామీ ఇచ్చారు.
gannavaram mla kondeti chittibabu went to the lanka villages at east godavari district