ఏప్రిల్ 21 నుంచి మే 1 వరకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్మశానవాటికలో 42 కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. అమలాపురంలో ప్రభుత్వ పరంగా గుర్తించిన 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ రెండు ఆసుత్రుల్లో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 50 మంది వరకు చనిపోయారని ఆయన చెప్పారు.
42 మృతదేహాలకు మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించామని.. మిగిలిన 8 మృతదేహాలను వారికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లి వేరు వేరు ప్రాంతాల్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారని వెల్లడించారు. ప్రత్యేకించి అమలాపురం పట్టణంలో కరోనా కేసులు కారణంగా.. మొత్తం 17 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని కమిషనర్ నాయుడు తెలిపారు.