Bike Accident : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ...నలుగురు మృతి - east godavari district latest news
19:56 November 14
ఘటనాస్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో మరొకరు మృతి
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో.. నలుగురు గిరిజన యువకులు మృతి చెందారు. రంపచోడవరం మండలం జాగరం పల్లి గ్రామానికి చెందిన కోడి రమేష్, కోసు శేఖర్... సీతపల్లిలో జరిగిన ఓ వివాహానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామం ప్రయాణమయ్యారు. అదే సమయంలో గంగవరం మండలం జియ్యంపాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, చోల్లం పండు రంపచోడవరం వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. ఐ.పోలవరం శివారుల్లోకి రాగానే ఇరువురి వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. దీంతో ఘటనా స్థలంలో రమేష్, శేఖర్, పండు మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన రాజబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో ముగ్గురు వ్యవసాయ కూలీలు కాగా.. పండు అనే వ్యక్తి ప్రైవేటు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరిలో శేఖర్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. ప్రస్తుతం అతడి భార్య గర్భవతిగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీచదవండి: POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్