Four AP people hanged in Varanasi : దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనాథ్‌పూర్‌లోని కాశీ కైలాష్ భవన్‌లోని రెండవ అంతస్తులో గది నంబర్ S6లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబ సాముహిక ఆత్మహత్య మిస్టరీ వీడింది. వారి నుంచి లభించిన రెండున్నర పేజీల సూసైడ్ నోట్‌లో రాసి ఉన్న అప్పు ఇచ్చిన వారిని పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు వేర్వేరు వ్యక్తుల నుంచి వీరు రూ.12 లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. రూ.6 లక్షలు వెచ్చించగా మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వెళ్లగా, డబ్బులు ఇచ్చిన వారు వడ్డీతో సహా మొత్తం తిరిగి ఇవ్వాలని కోరారు. వడ్డీ కూడా ఎక్కువేనని, తీసుకున్న మొత్తం కంటే ఎక్కువే తిరిగి ఇవ్వాలని కోరారు. డబ్బులు తీసుకున్న వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. డబ్బు తిరిగి ఇవ్వకుంటే కొన్ని రోజుల క్రితం ఆ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయని రాశారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
వారణాసిలో సంచలనం - ఒకే గదిలో ఉరి వేసుకున్న ఏపీకి చెందిన నలుగురు
East Godavari Family Suicide in Varanasi :ఆత్మహత్యకు అవసరమైన సామగ్రిని సమీపంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందుగా వీరంతా గదిలో పూజలు కూడా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సమీపంలో ఒక కుంకుమ్ బాటిల్ కూడా లభించింది. చనిపోయే ముందు నలుగురూ ఒకరి నుదుటిపై మరొకరు తిలకం పెట్టుకున్నారు. పాలిథిన్‌లో రోలీ, చందనం గదిలో దొరికాయి. నలుగురి చేతులకు కంకణాలు కూడా కట్టుకున్నారు. తాళ్లలో రెండు ఒక రంగు, రెండు మరో రంగు కలిగి ఉన్నాయి. ఇంట్లో సంపాదిస్తున్న ఇద్దరు సభ్యులైన కొండబాబు, రాజేశ్ తాడు నీలం రంగుది కాగా, లావణ్య, చిన్న కుమారుడు జయరాజ్ తాడు పసుపు రంగులో ఉంది. నలుగురి శరీరాలు ఒక్కొక్కటి ఒక అడుగు దూరంలో ఉన్నాయి. నలుగురి ముఖాలు ఒకరికొకరికి ఎదురెదురుగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో తల్లిదండ్రులు, చిన్న కొడుకు సహా ముగ్గురి మృతదేహాలు పూర్తిగా స్తంభించిపోగా, రాజేశ్ శరీరం కాస్త మామూలుగానే ఉండడంపై అధికారులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.