రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా చేస్తున్న అయిదు డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికి అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు అన్నా క్యాంటీన్లను తెరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రన్న భీమా పథకాన్ని పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర రంగాల వారికి రక్షణ కల్పించాలని అన్నారు.
అమలాపురం మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష - tdp
కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్చేస్తూ అమలాపురం మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా చేస్తున్న అయిదు డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని కోరారు.
అమలాపురం మాజీ ఎమ్మెల్యే నిరాహారదీక్ష