తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 15 రోజులుగా... జగ్గంపేటలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం అన్నీ దానాల కన్నా గొప్పదని పేర్కొన్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో ఈ అన్నదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రతి రోజు సుమారు 300 మందికి భోజనం పెడుతున్నట్టు వివరించారు. దీనివల్ల అన్నం లేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేశామన్నారు.
అన్నదానం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే - lockdpwn problems in east godavari dst
లాక్ డౌన్ కారణంగా తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే 15రోజులుగా పేదలకు అన్నదానం చేస్తున్నారు.
food distribution in east godavari dst jagampeta mla