ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద నీటిలోనే కాజ్​వే... నిలిచిన రాకపోకలు - floods to godavari

గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా.. కోనసీమలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. అయినమిల్లి మండల పరిధిలోని కాజ్​వే పూర్తిగా నీటిలో మునిగి ఉంది. చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Flood water flows
Flood water flows

By

Published : Aug 22, 2020, 4:57 PM IST

Updated : Aug 22, 2020, 6:20 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రెండు రోజుల కిందట తగిన వరద ప్రవాహం... తిరిగి మళ్లీ పెరగింది. అయినమిల్లి మండలం పరిధిలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి.

వెదురుబొడ్డం వద్ద ఉన్న కాజ్​వే వారం నుంచి వరద ముంపులో ఉంది. కాజ్​వే మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే స్థానికులు ప్రయాణిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించాకే సమస్య తీరే అవకాశం ఉంది.

Last Updated : Aug 22, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details